పవన్ కి పౌరుషం లేదు టీడీపీ నేతల ఓవరాక్షన్

1.2014లో ఓట్లేసి గెలిపిస్తే మా అమ్మని తిట్టిస్తావా అంటూ చంద్రబాబుని తిట్టావ్..
మళ్ళీ ఇప్పుడు ఆయన సంకనాకుతున్నావని.. నిజమైన కాపు నాయకుడికి ఉండాల్సిన పౌరుషం అది కాదంటూ పేర్ని నాని పవన్ పై ఫైర్.

2.రేపటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు. ఆయన ప్రసంగం అనంతరం అసెంబ్లీ, మండలి బీఏసీ సమావేశాలు.

3.ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
16న ఓట్ల లెక్కింపు. ఫలితాలకై సర్వత్రా ఉత్కంఠ.

4.మార్గదర్శిలో తనిఖీలకు యాజమాన్యం సహకరించడం లేదు ..
చిట్ ఫండ్స్ సొమ్మును ఇతర వ్యాపారాలకు వాడుతున్నారని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ వెల్లడి.

5.నెల్లూరు రామ్మూర్తి నగర్ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్..
పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న నేతల్ని ఐడీ కార్డు చూపించాలని అడగడంతో పోలీసులపై బుతులతో విరుచుకుబడ్డ వైనం.

6.పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..
మూడు నెలల తర్వాత బయటికొచ్చి బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని మాట్లాడుతున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజ౦.

7.జగన్ కు ఓటమి భయం పట్టుకుంది..
ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపణ.

8.విద్యనేర్పిన గురువులే అమ్ముడుపోతే ఎలా..?
మా వాళ్లు దోచుకున్నారు… అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు 5 వేలు ఇస్తున్నారని రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు.

9.ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉంచిన తెలంగాణ హైకోర్టు
విచారణ పూర్తయ్యేవరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం వెల్లడి.

10. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పులేదు..
కేంద్రం ప్రభుత్వం స్పష్టం.