ఏపీ రాజధాని అంశం సుప్రీం కోర్టులో నలుగుతూ వస్తుంది.ఈ కేసులో ఎప్పుడు ఫైనల్ తీర్పు వస్తుందోనని రాష్ట్ర ప్రజలంతా.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాము త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నామని ఇటీవల సిఎం జగన్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలోనే.. ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మరోసారి సిఎం జగన్ కీలక ప్రకటన చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రుల వద్ద వ్యాఖ్యానించారు. దీంతో.. అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. తానూ విశాఖకు షిఫ్ట్ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే.. మంగళవారం కేబినెట్ భేటీలో సీఎం జగన్.. విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్ వాళ్లతో స్పష్టం చేశారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేబినెట్లో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులకు అప్పగించిన సీఎం జగన్.. మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించారు కూడా. ఇక ఇదే సమావేశాలలో సుమారు 15 బిల్లులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెడతారా లేదా అన్నదే చాలా ఉత్కంఠ భరితంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఏఎ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది