జగన్ కి జై కొడుతున్న కాపులు పవన్ కమ్మసేన.. సభ తుస్

నిన్న మచిలీపట్నంలో సభ పెట్టిన పవన్ కళ్యాణ్ కి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఆయన సభ పెట్టింది పార్టీ కోసం కాదు ఆయన ప్యాకేజీ కోసం స్వయంగా పుబ్లిక్ అనడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఏ ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్ కే తెలియదని జెండా పవన్.. అజెండా టీడీపీది అంటూ వైసీపీ నాయకులు ఓరేంజ్ లో పవన్ కి కౌంటర్ ఇస్తున్నారు. కాపు కులాన్ని మూటగట్టి బాబుకు అమ్మేయాలన్నదే లక్ష్యమని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన” అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. పవన్ పవర్ స్టారా..? ఫ్లవర్ స్టారా అంటూ సెటైర్ వేశారు. 175కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదు గానీ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారని మంత్రి సెటైర్ వేశారు.
కాపు కులం అంతా సీఎం జగన్ వైపే ఉందని, రాజకీయంలో ఓ అజెండా ఉండాలి, కానీ పవన్ కి మాత్రం అది లేదని, ఆయనకు ఉన్నదల్లా ప్యాకేజీ అజెండానేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. ఇక ఇదే అంశంపై పుబ్లిక్ కూడా పవన్ పై సెటైర్లు వేస్తున్నారు. పవన్ కి పేర్ని నాని అడ్డాలో పవన్ సభ పెట్టి ఆయన రేంజ్ ని మరింత పెంచారని ప్రజలు అంటున్నారు. టిడిపితో పొత్తుల నేపధ్యంలోనే ఈ సభ పెట్టారని, అంతకుమించి ఈ సభ వల్ల వారికి గానీ, పార్టీకి గానీ ఒరిగింది ఏమీ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.