ఇది సోషల్ మీడియా యుగం ఏం జరిగినా క్షణాల్లో వైరల్ చేస్తారు. ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి పవన్ పై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన పరువు తీసే విధంగా ఉన్నాయి. ఆయన వంగవీటి రంగాకి టీ అందించాననడం అంటూ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆయన రంగాగారినే చూడలేదని.. 2011లో చెప్పిన మాటలకు .. నిన్నటి వేళ సభలో చెప్పిన మాటలను జోడించి మరీ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. వంగవీటి రంగా పేరును అడ్డు పెట్టుకొని కాపుల మనసులను గెలవాలని ఆయన పేరును వాడుకోవడం చాలా సిగ్గు చేటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇందుకు సంబందించి పవన్ కళ్యాణ్ టీ కప్పు పట్టుకొని ఉన్న ఫోటోలను ఎడిటింగ్ చేసి వాటిని షేర్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. చెక్కులు ఇచ్చాక పవన్ కళ్యాణ్ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. దీన్ని ప్రత్యర్థి పార్టీ పట్టేసింది. ఇదిగో చూడు.. పేదలపై పవన్‌కు ఎలాంటి ప్రేమ ఉందో అని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది.’అణగారిన వర్గాల వారిని పట్టుకున్నందుకే.. స్టేజ్ మీదనే చేతులు కడుక్కుంటున్నారు. దళితులు అంటే అంత అంటరాని తనమా’ అని రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు.