ఎన్నికల వేళ బాబుకి బ్యాడ్ న్యూస్ జగన్ కి కలిసొచ్చే కాలం పవన్ ఇచ్చిన కీ పాయింట్

ఏపీలో అల్మోస్ట్ ఎన్నికల సమయం వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల హడావిడి చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే..
అసెంబ్లీలో నేడు ప్రవేశ పెట్టబోయేది జగన్ సర్కార్ కు లాస్ట్ బడ్జెట్‌. సొ..ప్రతిపక్షాల ననోళ్ళు మూయించాలంటే ఆ మాత్రం ఉండాలి. ఇది ఎన్నికల సీజన్.. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ పై ఆసక్తి పెరుగుతోంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తాజా బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రానికి ఏం చేసావంటూ ప్రతిపక్షాలు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నాయి. ఇక పవన్ అయితే ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, రాయలసీమ ప్రజలకు ఎలాంటి ఉపయోగకరమైన నిర్ణయాలు ఈ జగన్ ప్రభుత్వం తీసుకోలేదని పవన్ కూడా ఆరోపణలు చేశారు. వీటన్నీటినీ దృష్టిలో పెట్టుకొని.. జగన్ సర్కార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం.

దాదాపుగా 2కోట్ల 59 లక్షల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం అయింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, పేదల ఇళ్లకు పెద్దపీట. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. సంక్షేమ రంగానికి మరోసారి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం బడ్జెట్ వేళ కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.ఈసారి కూడా ఎప్పటిలాగే వ్యవ‌సాయానికి ప్రత్యేక బ‌డ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలక బడ్జెట్ అన్ని వర్గాలకు ఊరటను ఇచ్చేలా ఉంటుందా అని అంతా ఎదరు చూస్తున్నారు.