తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా అనుకున్న ప్రకారమే ఉదయం 8 గంటలకే కౌంటింగ్ మొదలైంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ MLC ప్థానాలు.. 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతోంది. ఇక ఈ నేపధ్యంలోనే వైసీపీ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. పశ్చమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్ గెలిచారు. మొత్తం 418 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్ధి వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి 122 ఓట్లు రాగా.. మోత్తం పోలైన ఓట్లు 1088 ఓట్లలో 25 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో ఓట్ల లెక్కింపు ముగిసింది. స్థానిక సంస్థల MLC కౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం ఓట్లలో వైసీపీ అభ్యర్థికి 632 ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు రాగా.. చెల్లని ఓట్లు 12 వచ్చాయి.ఇక మిగతా స్థానాలు అన్నీ కూడా వైసీపీ నే కైవసం చేసుకుంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పూర్తి వివరాలకి మా చానెల్ ని ఫాలో అవ్వండి.