బాలయ్యకి రంగు పడింది తాగొచ్చి కొడితే నీ ఫ్యాన్స్ లా చూస్తూ ఉంటారా

తాజాగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెను దుమారమే రేపాయి. నేను మూడో కన్ను తెరిస్తే.. జగర్త అంటూ తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు బాలయ్య ఎవరంటూ నిలదీశారు . ఆయన హీరో అయితే టీడీపీకి గొప్పకానీ.. తనకు కాదన్నరు. బాలయ్య వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని చురకలంటించారు. బాలకృష్ణ ఎన్నోసార్లు తప్పుడు మాటలు మాట్లాడారని.. ఏదో ఒకటి అనడం, తప్పైపోయిందని వెనక్కి తీసుకోవడం ఆయనకు అలవాటన్నారు. ఓ పనికిమాలిన వెధవకి వత్తాసు పలికి స్థాయి దిగజార్చుకోవద్దని గోపిరెడ్డి హితవు పలికారు. మనుషులకు మూడో కన్ను వుండదని.. బాలకృష్ణ కూడా ఒక మనిషేనని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. సినిమాల్లో లాగా జీవితంలో నటించడం కుదరదని ఆయన చురకలంటించారు. రాజకీయాలలో ఎన్నో పుకార్లు వస్తుంటాయ్. కానీ వాటినే నిజాలు అని నమ్మేసి .. నోటికొచ్చినట్టు మాట్లాడటం.. అది పెద్దరికం అనిపించుకోదని ఎమ్మెల్యే గోపిరెడ్డి బాలయ్యకు సూచించారు. ఇకనైనా వాస్తవాలు, అవాస్తవాలు ఎంటొ.. ముందు వెనక చూస్కోని మాట్లాడాలంటూ వైసీపీఏ ఎమ్మెల్యే గోపిరెడ్డి బాలకృష్ణకి కౌంటర్ ఇచ్చారు.