1. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం..
శ్రీకాకుళం, పశ్చమ గోదావరి, కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఘన విజయం.
2.2023-24 ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన..
3.నేడు అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి..
సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్.
4.మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ విభాగం కీలక నిర్ణయం..
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోపాటు ఇతర రాష్ట్రాల సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలు కూడా విచారణ జరపాలని నివేదిక.
5.ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుత౦..
తమ రాజస్తాన్ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రకటన.
6.తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరు..
బాలయ్య పెద్ద హీరో అయితే అది టీడీపీకి గొప్ప అని… తనకు కాదని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కౌంటర్.
7.ఏపీలో పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉంది.. కులాల కొట్లాట తప్ప మరేమీ లేదు..
వైసీపీ, టీడీపీలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు.
8.విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం పెట్టుకుంటే అభ్యంతరం లేదు..
కానీ, ఏపీ రాజధానిగా మాత్రం అమరావతినే కొనసాగించాలని సుజనా చౌదరి స్పష్టం.
9.విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యా దీవెన పథకం నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్.
10.బడ్జెట్ సమావేశానికి హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం హాజరు..
అసెంబ్లీ లాబీల్లో బాలయ్యను పలకరించిన మంత్రులు బొత్స, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్