ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భంజ‌నం.. 2024లో బాబు – పవన్ లకు ఊచకోత

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీ ఖాతాలో భారీ విజయం దక్కింది. ఎన్నిక ఏదైనా.. బరిలో వైసీపీ ఉంటే వార్ వన్ సైడ్ అవుతోంది. తాజాగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. పోటీ జరిగిన అన్ని చోట్ల వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థులు ఘన విజయం సొంతం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థులు క‌వురు శ్రీ‌నివాస్, వంకా రవీంద్రనాథ్‌ గెలుపొందారు. ఇక కర్నూలు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. పార్టీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌రావు ఘ‌న విజ‌యం సాధించారు. మరోవైపు శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. ఇక మరోవైపు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ 5 స్థానాలలో దాదాపుగా 90% వైసీపీనే కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే.. ప్రధానమైన నానుడి ప్రజల్లో వినడబడుతోంది. ఈ ఎన్నికలు వచ్చే ఎన్నికలకు సెమీస్ అంటున్నారు.. రాష్ట్ర ప్రజలు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎవరితో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. వైసీపీ పక్కాగా విజయం సాధిస్తోందని అంటున్నారు. మరి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల చివరి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండనున్నాయో చూడాలి.