సభలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైసీపీ సభ్యులపై దాడి.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. వీరి తీరు కొట్టుకునే వరకు వచ్చి౦ది. ఇక ఈ సభ సజావుగా సాగకుండా అడ్డుతగిలి స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల అనుచిత౦గా ప్రవర్తించారు. టీడీపీ నేతలు పేపర్లు చించి స్పీకర్పైకి విసరడంతో పాటు ప్లకార్డ్ను ఆయనకు అడ్డుగు పెట్టిన సభలో గందరగోళ పరిస్థితికి దారి తీశారు. స్పీకర్కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మోహరించగా, ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులపై టీడీపీ నేతల దాడికి దిగారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దీనిపై స్పందించారు.. చంద్రబాబు నాయుడు
బీసీలకు ఎస్సీలకు గొడవ పెట్టాలని భావిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ గలాటా జరిగిందని ధ్వజమెత్తారు. ‘ఈ రోజు మితిమీరిపోయింది.. డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారని.. అడ్డుకోవడానికి వెళ్తే మాపై దాడి చేశారని’ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. సభాపతిని టీడీపీ అవమానించిందని, బీసీ అయిన సభాపతిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు.