1. అసెంబ్లీలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు..
స్పీకరైపై టీడీపీ సభ్యుల దాడి.. అడొచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపైన కూడా దాడికి యత్నం.
2.ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మి పట్టించుకోలేదు..
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం.
3.స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు చింపి విసిరేసిన టీడీపీ సభ్యులు
వెల్లంపల్లిని తోసేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
4.ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగానే గొప్పగా ఫీల్ అవుతున్నారు…
2024 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్య.
5.ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఎన్నికల ఫలితాలతో అర్థమయింది..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య.
6. పులివెందులలోనూ తిరుగుబాటు మొదలైంది..?
వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయన్న చంద్రబాబు.
7.ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..
రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.
8.YSRCP ని ఫాలో అవుతున్న టీడీపీ.. టార్గెట్ సీఎం జగన్, తెరపైకి కొత్త స్లోగన్!
వై నాట్ పులివెందుల ఇకపై ఇదే మా నినాదం’ అంటున్నారు పులివెందుల నియోజకవర్గం ఇంఛార్జ్ బీటెక్ రవి.
9.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి పిచ్చి పరాకాష్టకు చేరింది..
స్పీకర్ సైతం మా ఎమ్మెల్యే స్వామి పట్టుకున్న ప్లకార్డును తోసేశారని అచ్చెన్నాయుడు ఫైర్.
10.జీవో నంబర్ 1 ని రద్దు చేయాలని టీడీపీ, వామపక్ష పార్టీలు సోమవారం ఛలో విజయవాడకు పిలుపు..
పలువురు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరింపు.