గంటా రాజీనామా ఆమోదం ఎట్టకేలకే క్లారిటీ

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. అత్యంత కీలకమైన సమయంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారని సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇక ఈ నేపధ్యంలోనే.. టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా ఆమోదం అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అని, ఓటర్ల లిస్ట్ కూడా వచ్చి౦దని, ఆ లిస్ట్ లో తన పేరు కూడా ఉందని తాజాగా గంటా శ్రీనివాసరావ్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ నిజంగా ఇప్పుడు తన రాజీనామాను ఆమోదిస్తే అది వైసీపీకి పెద్ద మిస్టేక్ అంటూ గంటా సమాధానమిచ్చారు. రాజీనామాను ఆమోదించాలంటే దానికంటూ ఒక సమయం ఉంటుందని, తీరా ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజీనామాను ఆమోదించడం కుదిరే పని కాదని గంటా చెప్పారు. ఇప్పటికి రెండేళ్ళు గడుస్తున్నా దానిపై స్పందించకుండా ఇప్పుడు వాళ్ళ అవసరానికి ఇలాంటి ప్రచారాలు చేయడం ఓ మైండ్ గేమ్ అన్నారు. అయితే.. రెబల్స్ గా మారిన టిడిపి ఎమ్మెల్యేలను పక్కన బెడితే.. టిడిపి కి 19 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది. ఇక వైసీపీ నుంచి రెబల్స్ గా మారిన కోటం రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టిడిపికి సపోర్ట్ చేసే అవకాశం ఉందని, అది జరిగితే టీడీడీపి 21 ఓట్లు పడతాయి.. అయినప్పటికీ టిడిపి ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఇంకా ఒక్క ఓటు కావాలి. మరి ఆ ఒక్కరూ ఎవరు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎవరయినా వైసీపీ ఎమ్మెల్యే రెబల్ గా మారి టిడిపి కి సపోర్ట్ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి చివరి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉందనున్నాయో చూడాలి.