ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఊపిరి ఆగే ఉత్కంఠ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. సాంకేతికంగా టీడీపీకి 23 ఓట్లు ఉన్నాయి. అనూరాధకు కూడా 23 ఓట్లు వచ్చాయి. 22 ఓట్లు వస్తేనే ఓ అభ్యర్తి విజయం సాధించారు. అనూరాధకు ఓ ఓటు ఎక్కువే వచ్చింది. దీంతో ఆమె విజయం ఖరారయింది. టీడీపీ తపపున 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నలుగురు ఫిరాయించారు. అంటే 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. వారిలో ఇద్దరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. మరో ఇద్దరు వైసీపీతో పాటు క్యాంప్‌కు హాజరై .. సైలెంట్‌గా టీడీపీకి ఓట్లేశారు. దీంతో టిడిపి కి సైలెంట్ గా ఓటేసిన ఆ ఇద్దరు ఎవరు..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రాస్ ఓటింగ్ జరగటంతో టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. అంటే వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపి కమద్దతు ప్రకటించారు. అయితే వెన్నుపోటు పొడిచిన ఆ ఇద్దరు ఎవరు అన్నది వైసీపీకి దాదాపు అర్ధమయి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.