క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన ఆ ఇద్దరు వీరే

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 5 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే పంచుమర్తి అనురాధాకి 23 ఓట్లు పడ్డాయి. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి కి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే క్రాసింగ్ జరిగిన ఆ రెండు ఓట్లలో టిడిపి రెబల్స్ లేరు, ఇంకా వైసీపీ రెబల్స్ కూడా లేరు. అయితే సైలెంట్ గా టిడిపి కి మద్దతు తెలిపిన వారిలో ప్రధానంగా ఇద్దరు పేర్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు ఉండవల్లి శ్రీదేవి. ఈమె తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యురాలు. అయితే ఈమె గత కొద్ది కాలం నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ కూడా ఈమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇంకా ఈమె అమరావతి పరిదిలో అనేక దందాలు చేస్తున్నారని.. ఇలా అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. వైసీపీకి వెన్నుపోటు పొడిచిన వారిలో ఇంకొకరు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోన్న వారిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా వినబడుతోంది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ కి పాల్పడితే.. ఈ ఇద్దరే అందుకు కారణం కావచ్చని మొదటి నుంచి పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పేర్లు ప్రధాన న్యూస్ ఛానెల్స్ లో, ఇంకా సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి.అయితే క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన వారిలో ఇకా అధికారికంగా అయితే ప్రకటన వెలువడలేదు.