ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఆరవ స్థానం గెలుచుకున్న వైసీపీ

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు.తొలి ప్రాధాన్యత ఓట్లలో కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ చెరో 21 ఓట్లు సాధించారు. వీరిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో జయమంగళ ఓడిపోయారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్దులు మర్రి రాజశేఖర్ 22 ఓట్లు, సూర్యనారాయణ రాజు 22 ఓట్లు, బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు, పోతుల సునీత 22 ఓట్లు,యేసు రత్నం 22 ఓట్లు వచ్చాయి. అలాగే జయమంగళ వెంకట రమణకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అటు కోలా గురువులుకూ 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే వీరిద్దరికీ కేటాయించిన ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరు వీరికి ఓటు వేయలేదు. అటు వైసీపీ రెబెల్ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి కూడా టీడీపీ అభ్యర్ధి పంచుమర్తికే ఓటు వేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు వైసీపీ అధిష్టానం మాటను ధిక్కరించి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేసిన వ్యవహారంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఇలా క్రాస్ ఓటింగ్ చేసిన వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రాస్ ఓటింగ్ చేసిన వారి పని పట్టేందుకు వైసీపీ సిద్దమయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలకు కేటాయించిన కోడ్ ప్రకారం క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన వారిని కనిపట్టే పనిలో వైసీపీ ఉంది. మరి ఆ ఇద్దరు ఎవరనేది మరికొన్ని క్షణాల్లో తేలనుంది