ఆ ద్రోహులు వీరీ బాం** పేల్చిన ఎమ్మెల్యే వసంత

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ భరితంగా సాగాయి. వైసీపీలో క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ.. ప్రధాన న్యూస్ చానెల్ లో ఓ లిస్ట్ విడుదల అయ్యింది. ఆ లిస్ట్ లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేరు కూడా ఉండటంతో.. వెంటనే రియాక్ట్ అయిన ఎమ్మెల్యే వసంత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఊపిరి పోయినా జగన్ ను మోసం చేయను, తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే సంస్కృతి నాకు లేదంటూ.. TV9తో మాట్లాడిన వసంత క్లారిటీ ఇచ్చారు. తాను గుంటూరు ఘటనలో nri తరుపున మాట్లాడిన మాట వాస్తవమే, జోగి రమేష్ తో తనకు గొడవలు ఉన్న మాట కూడా వాస్తవమే.. అలా అని తాను నమ్ముకున్న పార్టీకి వెన్నుపోటు పొడిచే సంస్కృతి నాకు లేదంటూ వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నమ్మక ద్రోహానికి పాల్పడిన వారు ఎవరో కూడా తనకు తెలుసని ఎమ్మెల్యే వసంత మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పుకొచ్చారు. అనుమానితుల లిస్ట్ లో ఉన్నది ఎవరో చెప్పడానికి సజ్జలకి కూడా కాల్ చేశానని, కానీ ఆయన తన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదని ఎమ్మెల్యే వసంత చెప్పుకొచ్చారు. నాపై ఆరోపణలు చేస్తున్న వారు రేపు బాధపడే పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది అన్నారు ఎమ్మెల్యే వసంత.