1.ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు…
మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అంటూ సీఎం సందేశం.
2.సంక్షేమం వద్దని ప్రతిపక్షం చెప్పగలదా!?
రాష్ట్రంలో అధిక గ్రోత్ రేటు నమోదు కావడానికి సంక్షేమ పథకాలూ కారణమేనని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం.
3.వాడి వేడిగా ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశాలు..
నిబంధనలు ధిక్కరించిన టిడిపి ఎమ్మెల్యేలు, సభ నుంచి సస్పెండ్.
4.ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం
క్రాస్ ఓటింగ్తో ఒక ఎమ్మెల్సీ నెగ్గిన టీడీపీ. ఇంకా వీడని సస్పెన్షన్
5.ఇచ్చిన కోడ్ ప్రకారమే ఓటేశా..
ఎమ్మెల్యే శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు..
6. చంద్రబాబు వైస్రాయ్ రాజకీయాలను ఇప్పటికీ సిగ్గులేకుండా కొనసాగిస్తున్నారు…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని మంత్రి ఆర్ కె రోజా హాట్ కామెంట్స్.
7.23 న 23 ఓట్లతో టిడిపి గెలుపు… ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే..:.
సిఎం జగన్ కు పయ్యావుల కేశవ్ కౌంటర్.
8.నేడు సైకిల్ ఎక్కనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
9.ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీ..
జస్టిస్ దేవానంద్‌ను బదిలీ చేస్తూ నాలుగు నెలల క్రితం సుప్రీం కొలీజయం సిఫార్సు.
10.ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడిన నెల్లూరు, కోస్తాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను గుర్తించిన వైసీపీ
సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామన్న సజ్జల