శాసనసభలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్సింగ్

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో కలవరం మొదలయ్యింది. టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు వేయడంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇక ఇదే క్రమంలో వారు ఎవారా అని వైసీపీ ఆరా తీసింది. వారెవరో గుర్తించామని అధిష్టానం చెప్తున్నప్పటికీ.. వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ఇక ఈ క్రమంలోనే.. ఇద్దరు పేర్లు మీడియాలో ఈ విషయం కోడై కూస్తోంది. అయితే.. తనపై వచ్చిన ఆరోపణలకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివరణ ఇచ్చుకున్నారు. ‘నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను ఓటు వేశానని ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే.. నేడు శాసనసభలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించలేదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి. నేడు అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు.. అయినప్పటికీ వీరు మాత్రం సభకు హాజరు కాలేదు. అయితే.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఉండవల్లి శ్రీదేవి క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ నేడు ఆమె సభకు హాజరు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు శ్రీదేవి వివరణ ఇచ్చుకోగా ఇంతవరకూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం స్పందించిన దాఖలాల్లేవ్. ఇక మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని, ఆయన కూడా సభకు హాజరు కాలేదని సమాచారం. ఆయన బెంగళూరుకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన టీడీపీకి ఓటు వేసి ఉంటారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ఆయన మీడియా ముందుకు రావాల్సిందే..