మీడియా ముందుకు మేకపాటి బిగ్ ట్విస్ట్

తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. టిడిపికి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అంటూ.. ఇప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఆ ఇద్దరు ఎవరో తమకు తెలిసిపోయిందని వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని వైసిపి అధిష్టానం చెబుతున్నప్పటికీ.. ఆ ఇద్దరు పేర్లను వైసీపీ అధికారకంగా ప్రకటించలేదు. ఇక ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మిస్సింగ్ అంటూప్రచారం జరుగుతుంది. నేడు జరిగిన ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాజరు కాకపోవటంతో ఆయన టిడిపికి ఓటు వేసి ఉంటారని ప్రచారం కూడా జరిగింది. నిజంగా ఆయన ఏ తప్పు చేయకపోతే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ఆయన వివరణ ఎందుకు ఇచ్చుకోలేకపోయారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి అగ్నికి మరింత ఆజ్యం పోసి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీవీ9తో మాట్లాడారు. తాను ఎలాంటి క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చెప్పిన విధంగానే.. అదే పద్ధతిలో ఓటు వేశానని, నేను ఓటు వేసినటువంటి వెంకటరమణ ఎమ్మెల్సీగా గెలవడం జరిగిందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. మధ్యలో ఉన్నవారు నాకు టికెట్ రాకుండా ఉండటం కోసమే చిల్లరి వాళ్లు చిల్లరి వార్తలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఉన్నటువంటి మాజీలు, ఉదయగిరి నియోజకవర్గంలో తానంటే గిట్టని వారు ఇలా లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉదయగిరిలో ఉన్న వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు తొలగించడంపై కూడా ఆయన సీరియస్ అయ్యారు.