సీఎం జగన్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. నేడు జరిగిన ఆఖరి బడ్జెట్ సమావేశాలలో రెండు కీలక బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బోయ మరియు వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, అలాగే దళిత క్రిస్టియన్ లను ఎస్సీల్లో చేర్చుతూ.. ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఈ తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. ఈ తరుణంలోనే ఈ తీర్మానాలను ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రెండు తీర్మానాలను ఏ జగన్ ప్రభుత్వం కేంద్రానికి పంపించనుంది. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ లో మరో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.