టిడిపి నేత చింతకాయల విజయకు భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో సిఐడి అధికారులు ఆయనకు మరోసారి నోటీసులు అందించారు. మార్చి 28వ తేదీన విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.అయితే.. నర్సీపట్నంలోని ఆయన నివాసానికి చేరి అధికారులు వెళ్ళగా విజయ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి అయిన పాత్రుడికి నోటీసులు అందజేశారు. అసలు ఈ నోటీసులు ఆయనకు ఇవ్వడానికి గల కారణాలు పరిశీలిస్తే..
40% కమిషన్ తీసుకోబడును అంటూ అందులో సీఎం జగన్ సతీమణి భారతి ఫోటోను ముద్రించి క్యూఆర్ కోడ్ స్థానంలో భారతి బొమ్మను ముద్రించారు. ఇక్కడ లిక్కర్ సొమ్ము తీసుకోబడును అంటూ అందులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఏపీలో లిక్కర్ మాఫియాకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలను వైసిపి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో వైఎస్ భారతి పేరు తెరపైకి రావడంతో వాటిని టిడిపికి చెందిన కొంతమంది పోస్టర్ల రూపంలో ముద్రించి గోడలపై అతికించడం గతంలో కలకలం రేపుతుంది. అయితే… దీనికి సంబందించి టీడీపీ నేత చింతకాయల విజయ్ కు గతంలోనే ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. ఈ వ్యవహారంలో పబ్బం గడుపుతూ వస్తున్న విజయ్ కి ఏపీ సీఐడీ మరోసారి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పుడు సీఐడీ నోటీసుల పైన విజయ్ స్పందన చూడాలి. ఆయన ఆ రోజున విచారణకు హాజరవుతారా లేక సమయం కోరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.