ఉండవల్లి కాదు ఊసరవెల్లి.. శ్రీదేవి అసలు భాగోతం ఇదే..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలు నేడా.. రేపా అన్న సీన్ ను తలపించేలా ఏపీ రాజకీయాలలో రోజుకో ట్విస్ట్ లు దర్శనమిస్తున్నాయి. తాను క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదంటూ.. ఉండవల్లి శ్రీదేవి ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా.. సిఎం జగన్ పై అనేక రకాల ఆరోపణలు చేశారు. ఇక ఈ నేపధ్యంలోనే.. ఆమెపై వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు వ రేంజ్ లో మండిపడుతూ.. కౌంటర్ లు ఇస్తున్నారు. ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదని ఊసరవెల్లి శ్రీదేవని విమర్శించారు. సినీనటి శ్రీదేవిని మించిన గొప్ప నటి అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఆమెకు ఇప్పుడే ఎందుకు కనిపిచాయని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు సీఎం జగన్ దగ్గరకు కూతురుని తీసుకెళ్లి ఫొటో దిగిందని… ఆయనను అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని మండిపపడుతున్నారు.

శ్రీదేవి వంటి నమ్మక ద్రోహుల గురించి మాట్లాడటమే వేస్ట్ అని తాజాగా తానేటి వనిత కూడా రియాక్ట్ అయ్యారు. త్వరలోనే ఆమె అందరూ ఛీకొట్టే స్థితికి చేరుకుంటుందని అన్నారు. దిగ్గజ నటి శ్రీదేవి సినిమాల్లో అద్భుతంగా నటిస్తే.. ఈ శ్రీదేవీ రాజకీయాల్లో అద్భుతంగా నటిస్తోందన్నారు. మహానటిని మించిన అవార్డు ఇవ్వొచ్చన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన జగన్ గురించి అలా మాట్లాడితే.. పార్టీ ఉపేక్షించదన్నారు. ఆమెకు పార్టీ మారాలి అనిపిస్తే.. రాజీనామా చేసి వెళ్లొచ్చని.. లేని పోని ఆరోపణలు చేయడం సరికాదని వైసీపీ శ్రేణులు ఫైర్ అయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉంటూ.. తాడికొండ నియోజకవర్గం పరిధిలో అనేక రకాల అవినీతి, దందాలకు పాల్పడిందని తాజాగా ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు.
స్కాములు, స్కీములు, టిడ్కో ఇళ్లు అంటూ శ్రీదేవి ఏదేదో మాట్లాడతున్నారని.. అసలు ఈ దందాలన్నీ ఆమె నియోజకవర్గంలో జరుగుతున్నాయని అన్నారు. శ్రీదేవికి ఏపీలో పూర్తి రక్షణ ఉందని.. ఆమెకు టీడీపీ నుంచే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నాయకులే దాడి చేసి.. దాన్ని వైసీపీ వాళ్లే చేశారని చెప్తారన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, తప్పు చేసిన వారిని జగన్ ఉపేక్షించరని తేల్చిచెప్పారు. అయితే.. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి అమరావతికి జై కొట్టారు. ఒకప్పుడు సిఎం జగన్ బాటలోనడుస్తూ.. అదే అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరించి ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాను టిడిపి కి ఓటు వేయలేదంటూనే.. అమరావతికి మద్దతు తెలపడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి ఉండవల్లి శ్రీదేవి నెక్స్ట్ స్టెప్ ఏంటో అనేది.