ఏబీఎన్ రాధాకృష్ణ ఆఫీస్ కు శ్రీదేవి సంచలన నిజాలు వెలుగులోకి సీసీ పుటేజ్ తో అసలు బండారం బట్టబయలు

వైసిపి రెబెల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఆమె నూరు శాత0 తప్పు చేసిందని, ఆమె స్వార్ధ రాజకీయాల వల్ల చివరకు దళితులకు తలవంపులు వస్తున్నాయని.. దళిత నాయకులు ఆమెపై మండిపడుతున్నారు. ఆమె అసలైన బండారం ఇదేనంటూ దళిత నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి శ్రీదేవి గత ఆరు నెలలుగా టిడిపితో టచ్ లో ఉన్నారని.. వ దళిత నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంటినెంటల్ హాస్పిటల్ లో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా ఆ హాస్పిటల్ లో ఉన్న సమయంలో..
స్వాగత్ గ్రాండ్ కిషోర్ రెడ్డి, బొల్లినేని రామారావు అనే వ్యక్తులు ఆమెను ఏబీఎన్ రాధాకృష్ణ ఆఫీస్ కు తీసుకెళ్లారని, ఎమ్మెల్సీ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు.. శ్రీదేవి కూతుర్ని చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లారని, ఆ కార్ నెంబర్ కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఈ దళిత నాయకుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీదేవి కూతురుకి చంద్రబాబు నాలుగున్నర కోట్లను అడ్వాన్స్ గా ఇచ్చారని వెల్లడించారు. ఆ డబ్బును శ్రీదేవి కూతురు డైరెక్ట్ గా హైదరాబాద్ కి తీసుకెళ్లిందని దళిత నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత క్లియర్ కట్ గా వారి బండారం బయటపడి0దంటూ.. ఇంకొద్ది రోజుల్లో ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది అన్నది కూడా సీసీ పుటేజ్ తో సహా ఇస్తామని డ అలిత నాయకుడు స్పష్టం చేశారు. నువ్వు నిజంగా నిజాయితీపరురాలివి అయితే.. మీ కుటుంబ సభ్యులంతా విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఆరునెలల నుంచి నువ్వు టిడిపి నేతలకు టచ్ లో ఉన్నావో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని అన్నారు. మరి ఈ ఆరోపణలకు ఉండవల్లి శ్రీదేవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.