1.కొండెపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి అశోక్ బాబు తల్లి భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులు…
కుటుంబ సభ్యులను పరామర్శ.
2. విశాఖపట్నంలో వైఎస్సార్ ఏపీ 1 పోర్టల్ ను ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్…
ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, డైరెక్టర్ సృజన హాజరు.
3.ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలకు సీఎం జగన్ కు టీటీడీ ఆహ్వానం..
ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 09 తేదీ వరకూ ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.
4.కొనటం, అమ్మడమే చంద్రబాబు విజయ రహస్యం..
23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చంద్రబాబు నంగనాచి కబుర్లు చెబుతున్నారని పేర్ని నాని విమర్శ.
5.ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పచ్చ పార్టీ నేతలు తనను సంప్రదించారు..
తన కాల్ డేటాను చూస్తే ఏ నాయకుడు ఫోన్ చేశారో తెలుస్తుందని వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్.
6.రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై చర్చా గోష్టి..
పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర ప్రభుత్వం స్పష్టం
7. వైఎస్ వివేకా కేసులో సిబిఐ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
దర్యాప్తు అధికారిని మార్చాలని ధర్మాసనం సంచలన తీర్పు..
8.సీఎం.. సీఎం అని అరిస్తే కాదు.. ఓట్లు గుద్ది పవన్ ను సీఎంను చేయాలి..
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు.
9. జబర్దస్త్ మేడం.. పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూస్కో
పేకాట క్లబ్బులు నడిపిన రాపాక 10 కోట్ల కోసం మాట్లాడుతున్నావు.. అసలు నీకు 10 వేలు ఇస్తే చాలని వంగలపూడి అనిత ఎద్దేవా.
10. ఏపీ అప్పు 12 లక్షల కోట్లు దాటనుంది..
అధిక అప్పుల వల్ల ప్రజలపై భారం పడుతోందని యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు.