బాబు ఓటుకు కోట్లు రాజకీయం నేడు సుప్రీం కోర్టులో కేసు విచారణ జగన్ జాగ్రత్తగా ఉండాలన్న రఘురామ

1.నేడు సుప్రీం కోర్టులో అమరావతి కేసు విచారణ..
అమరావతి కేసుతోపాటు రాష్ట్ర విభజన కేసులను విచారణ చేపట్టనున్న న్యాయస్థానం.

2.నేడు సిఎం జగన్ విశాఖ టూర్..
రాడిసన్ బ్లూ హోటల్లో ప్రారంభం కానున్న జీ-20 సదస్సుకు హాజరు.

3. సీఎం జగన్ కి ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు..
దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే విధంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకుగానూ సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం.

4.బాబు ఓటుకు కోట్లు రాజకీయంపై విచారణ జరపాలి..
నాటి వైశ్రాయ్ నుంచి నిన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు వరకు బాబుది ఇదే తీరు అంటూ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఫైర్.

5.అప్పట్లో లక్ష్మీ పార్వతి, ఇప్పుడు సజ్జల.. జగన్ జాగ్రత్తగా ఉండాలి..
లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడం వల్లే టీడీపీలో సంక్షోభం తలెత్తిందన్న రఘురామ రాజు

6.దొంగలందరూ మీ ఇళ్ల పక్కనే ఉన్నారు.. వారు చెప్పింది విని జగన్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యొద్దు..
ఎన్నికల్లో ఇంకొకరికి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ధర్మాన హెచ్చరిక

7.ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మప్రబోథానుసారం ఓటు వేస్తే సస్పెండ్ చేస్తారా..?
తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్న విషయం తెలిస్తే జగన్‌కు పక్షవాతం వస్తుందేమోనని వంగలపూడి అనిత ఎద్దేవా.

8.మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏ2 చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు..
ఏ1 గా రామోజీరావు, ఏ2 గా చెరుకూరి శైలజలను పేర్కొన్న సీఐడీ.

9.ఏపీ స్పీకర్ తమ్మినేనిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతికి కూన రవికుమార్ ఫిర్యాదు
తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారని కూన రవికుమార్ ఆరోపణ.

10.సీఎం జగన్ సొంత జిల్లాలోనే దళిత ఉన్నతాధికారి ప్రాణాలకి విలువ లేదా..
కడప జిల్లాలో డీడీ అచ్చెన్న హత్యపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆవేదన.