ఉండవల్లి శ్రీదేవి 12 లక్షలకు కక్కుర్తి మరో మోసంతో అడ్డంగా బుక్కైన మహానటి

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ ఇంకా తగ్గలేదు. క్రాస్ ఓటింగ్ చేశారంటూ వైఎస్సార్‌సీపీ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వమ్మక ద్రోహులు అంటూ.. వైసీపీ కార్యకర్తలు వారిరువురిపై గుర్రుగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీడియా ముందుకు వచ్చి.. సిఎం జగన్ ను టార్గెట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆమెపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తోందని.. ఏపీ రావాలంటేనే భయమేస్తుంది అంటూ శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలోనే.. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి.. ఆమె ఫ్లెక్సీలను చించివేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా.. ఉండవల్లి శ్రీదేవి తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి ఆరోపించారు. శ్రీదేవితో పాటూ ఆమె భర్త డాక్టర్‌ కమ్మిలి శ్రీధర్‌ 2017లో తన దగ్గర రూ.12 లక్షలు తీసుకున్నారని.. వాటిని తిరిగి ఇప్పించాలని
ఎమ్మెల్యే శ్రీదేవి దంపతులు తనపై పెట్టిన అక్రమ కేసులను కొట్టి వేయాలని గూడూరుకు చెందిన రమణయ్య నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఉండవల్లి శ్రీదేవి భర్త శ్రీధర్‌కు పరిచయం చేశానని.. వారిద్దరు డాక్టర్‌ శ్రీధర్‌కు పద్మశ్రీ అవార్డు ఇప్పించేందుకుగాను కోటిన్నర అవుతుందని చెప్పారన్నారు. ఆ వ్యక్తులు అడ్వాన్స్‌ కింద 2017 జనవరి 29న 52 లక్షలు శ్రీధర్ నుంచి తీసుకున్నారన్నారు. కానీ అవార్డు ఇప్పించకుండా మోసం చేశారని చెప్పుకొచ్చారు.
ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని శ్రీదేవి దంపతులు తన దగ్గర.. ఒకసారి 10లక్షలు, మరోసారి 2లక్షలు చేబదులుగా తీసుకున్నారన్నారు. ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వకుండా తనపైనే తప్పుడు కేసులు బనాయించారని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే శ్రీదేవి దంపతులపై తగిన చర్యలు తీసుకోవాలని రమణయ్య కోరారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల్ని తిరిగి చెల్లించేలా.. తనకు తగి న్యాయం చేయాలన్నారు. మరి ఈ ఆరోపణలపై ఉండవల్లి శ్రీదేవి దంపతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.