మంత్రివర్గంలో పెనుమార్పులు జగన్ తప్పించబోయే ఆ నలుగురు ఎవరు..?

అవును మీరు విన్నది అక్షరాలా నిజం. తొందరలోనే మంత్రివర్గంలో మార్పులు ఉండనున్నాయని ఎప్పటినుండో జనాల్లో నానుతోంది. ఇక ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు క్యాబినెట్ సమావేశంలో స్వయంగా సిఎం జగన్ చెప్పారు. ఎవరి పనితీరు మెరుగ్గా లేదో.. వారిని తప్పించి వారి స్థానంలో కొత్త వారిని నియామిస్తామని కూడా సిఎం జగన్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను మంత్రుల సామర్ధ్యానికి పరీక్షగా కూడా చెప్పారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు మూడు పట్టభద్రుల స్ధానాల్లోను వైసీపీ ఓడిపోయింది. దాంతో అభ్యర్ధుల గెలుపుకు ఎవరు పనిచేశారు ఎవరు పనిచేయలేదనే వివరాలను జగన్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు.దానిపై తప్పించాల్సిన వాళ్ళు ఎవరు అనే విషయంలో క్లారిటి వచ్చిందట. ఇదంతా ఎందుకంటే సోమవారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను జగన్ కలిశారు. దాంతో మంత్రివర్గం ప్రక్షాళనపై ఒక్కసారిగా ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని ఏకంగా నలుగురిని తమ పార్టీ నుండి సస్పెండ్ కూడా చచేసింది.. అధిష్టానం. అంటే .. దీనిని బట్టి కూడా చెప్పవచ్చు పార్టీ కోసం ఆయన ఎలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారో అనేది. ఏదేమైనా కొందరు మంత్రుల పనితీరుపై జగన్లో బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. ప్రస్తుత రాజకీయాలు వైసీపీని కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే సిఎం జగన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే.. తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరు మెరుగ్గా ఉండాలనేది సిఎం అభిప్రాయం. అంతేకాదు తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను అంతే ధీటుగా తిప్పికొట్టే మంత్రులే.. ప్రస్తుతం పార్టీకి చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రులలో నలుగురు పనితీరు అంతంత మాత్రంగానే ఉందని.. త్వరలో వారిని తప్పించి.. కొత్త వారికి అవకాశయం కల్పించనున్నట్లు పార్టీ వర్గాల్లో తెగ ప్రచారం అవుతోంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమే అయితే.. ఎవరికి పదవులు ఉడతాయో చూడాలి.