1.నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న సీఎం.
2.ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..
పోలవరం ప్రాజెక్టు పనులకు చేసిన ఖర్చులో మరో 826 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం విడుదల.
3.మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీరావు బెంబేలు..
అందుకే దళితులపై దమనకాండ’ అంటూ ఈనాడు అడ్డగోలు రాతలు రాస్తున్నారు.. రామోజీకి ఇబ్బంది వస్తే దళితులే గుర్తొస్తారన్న మంత్రి మేరుగు.
4.కోనసీమ అల్లర్ల కేసుల విషయంలో కేసులు ఎత్తివేయాలని సిఎం జగన్ కీలక నిర్ణయం
అందరూ కలిసిమెలిసి ఉండాలనే యోచనతోనే నిర్ణయం తీసుకున్నామన్న సీఎం.
5.మండలానికి 5 లక్షలు ఇచ్చి నా దిష్టిబొమ్మను తగలబెట్టిస్తున్నారు..
ఇలాంటి గౌరవం దక్కడం తన కర్మ అంటూ చెంపలు వాయించుకున్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి.
6.నేడు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం..
శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. హైదరాబాద్ లో భారీ సభ..
7.చంద్రబాబు శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంది ..
ఆయన జూలు విదిల్చి తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చి ప్రతిపక్షాల ఉద్యమంలోకి రావాలని కేవీపీ రామచంద్రరావు పిలుపు.
8.ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగనే మర్చిపోయి టీడీపీకి ఓటేశారేమో… ఎవరికి తెలుసు..
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అచ్చెన్నాయుడు వెల్లడి.
9.ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమయానికి జీతాలు చెల్లించలేని దివాలాకోరు, అసమర్థ సీఎం జగన్..
టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలకు వైసీపీ ప్రభుత్వం కోత విధించిందని లోకేష్ ఆరోపణ.
10. ప్రజలకు బీజేపీపైనే భరోసా ఉంది..
తెలుగు రాష్ట్రాల్లో అధికారంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..