ఎమ్మెల్సీ ఎన్నికల హీటు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఇప్పటికే.. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు మైండ్ గేమ్ ని బట్టబయలు చేశారు. ఇక ఈ నేపధ్యంలోనే మరో ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్ధికి ఓటు వేస్తే కోట్లు ఇస్తామని టిడిపి ఆఫర్ ఇచ్చిందని.. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు తన కొడుకుకి కూడా ఆశ చూపించారని అంటున్నారు ఎమ్మెల్యే ఆర్థర్. తనకు డబ్బు కన్నా జగనే ముఖ్యం.. అందుకే టిడిపి ప్రలోభాలకు లొంగలేదని, వారి ఆఫర్ ని తిరస్కరించారని ఎమ్మెల్యే ఆర్థర్ చెప్పుకొచ్చారు. ముందు తన కుమారుడికి ఫోన్ చేశారని.. ‘మా నాన్న ఒప్పుకోడని నా కుమారుడు వారికి చెప్పినట్లు’ వివరించారు. పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లిలో తన ఇంటి దగ్గర కలవాలని ప్రయత్నించారన్నారు. ఒకవేళ తన ముందు 200 కోట్లు ఓవైపు.. వైఎస్ జగన్ ఫొటో ఒకవైపు పెడితే.. తాను జగన్ ఫోటోనే తీసుకుంటాను అన్నారు ఆర్థర్. తాను అలా డబ్బుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని.. జగన్తో తన ప్రయాణం కొనసాగుతుంది అన్నారు. ఇలా రోజుకో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందంటూ మీడియా ముందుకు రావడం ఆసక్తికరంగా మారి౦ది.