బీజేపీపై నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారు. ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో పాడు పని చేస్తూ.. కెమెరాకి అడ్డంగా దొరికిపోయాడు. అసెంబ్లీ సమావేశాల్లో అశ్లీల వీడియోలు చూస్తూ జనం చేత ఛీ కొట్టించుకుంటున్నాడు. ఈ వీడియొ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ ఎమ్మెల్యేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన త్రిపురలో అసెంబ్లీలో జరిగింది. గురువారం బడ్డెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు. దర్మం కోసం అని చెప్పుకుని తిరుగుతూ అసెంబ్లీలో ఇలాంటి పాడు పనులు చేయడం ఏంటంటూ బీజేపీపై నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు.

ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. ఎమ్మెల్యేను వివరణ కోరుతూ.. నోటిసులు పంపించింది. ఈ వీడియోపై ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు. సభ ముగిసిన వెంటనే ఆయన అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీపీఎంకు కంచుకోటగా పేరొందిన బగ్‌బాసా అసెంబ్లీ నియోజకవర్గంలో జాదవ్ లాల్ నాథ్ బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేశారు. 2018 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి బిజితా నాథ్ బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్ నాథ్‌పై 270 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో జాదవ్ లాల్ నాథ్‌ 1400 ఓట్ల తేడాతో గెలుపొందారు.