1.ఏప్రిల్ 3వ తేదీన గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష..
మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో జగన్ సమావేశం.
2.చంద్రబాబు అతి పెద్ద మ్యానిప్యులేటర్.. వ్యవస్థలను మేనేజ్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు..
బాబు కోసమే పవన్ క్యలాణ్ పుట్టాడు.. ఆయనను దేవుడే రక్షించాలని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు.
3.తణుకు శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి..
షార్ట్ సర్క్యూట్ కారణంగా చలువ పందిరిలో చెలరేగిన మంటలు.. భయంతో బయటకు పరుగులు తీసిన భక్తులు
4.పులివెందుల కాల్పుల ఘటన కేసు కోర్టులో విచారణ..
భరత్ కుమార్ యాదవ్ కు 14 రోజుల రిమాండ్.
5.నంద్యాల జిల్లాలోని డోన్ మండలంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ..
ఈ ఘటనలో ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురికి గాయాలు.
6.ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్స్..
విద్యాశాఖ అధికారులు వెల్లడి.
7.సిఎం జగన్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేస్తున్నాడని ఓ ప్రవాసాంధ్రుడిని అరెస్టు చేసిన పోలీసులు…
గన్నవరం, రాయ్ నగర్ కు చెందిన కోటిరత్నం అంజన్ అనే యువకుడు సొంత ఊరికి వచ్చిన వెంటనే అరెస్ట్.
8.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత..
స్వ ల్ప అస్వస్థతకు గురైన ఆయన భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి.
9.సీఎం జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో అసలు విషయం బట్టబయలైంది..
వైఎస్ వివేకా కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో.. భయంతో ఢిల్లీకి వెళ్లారని సీపీఐ నేత నారాయణ ఆరోపణ.
10.అమరావతి రాజధాని అంశంపై సీఎం జగన్ మంకుపట్టు వీడాలి..
హైకోర్టు చెప్పిన విధంగా అమరావతినే రాజధానిగా అభివృద్ధి పరచాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్.