ఉదయగిరిలో హై టెన్షన్ వైసీపీ దెబ్బకి దాక్కున్న మేకపాటి

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గురువారం నాడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు రియాక్ట్ అయ్యారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏమని సవాల్ చేశారంటే.. ఉదయగిరి నుంచి ఏ మగాడు నన్ను పంపించేది.. ఏంది ఆ పొగరు, పొగరు గిగరు అన్నీ అణగిపోతాయ్, రమ్మను ఎవడొస్తాడో నేను చూస్తా, అందుకే బెంగుళూరు నుండి ఉదయగిరికి వచ్చా, మగాళ్లయితే రండి.. వచ్చి నన్ను పంపించండి అంటూ.. ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకొని కూర్చొని ఈ సవాల్ చేశారు. ఈ సవాల్ ను వైసీపీ నేత వినయ్ కుమార్ రెడ్డి స్వీకరించి.. ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు వచ్చారు. తాను భోజనానికి వెళ్లిన సమయంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వచ్చాడని, తమ సవాల్ కు కట్టుబడి ఉన్నట్టుగా వినయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినయ్ కుమార్ ఈ రోజు ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకొని కూర్చొని.. మేకపాటి దమ్ముంటే రా.. తేల్చుకుందాం అంటూ సవాల్ చేశారు. ఎన్నికల వరకు ఎనీ టైమ్ నేను ఇక్కడే ఉంటా.. రమ్మనండి చూసుకుందాం అంటూ వినయ్ కుమార్ సవాల్ చేశారు. ఇక ఈ నేపధ్యంలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో దాక్కున్నారని ప్రముఖ మీడియాలో ప్రచారం అవుతోంది. వినయ్ కుమార్ సవాల్ పై ఆయన రియాక్షన్ ఏంటి అని మీడియా వారు తెలుసుకునే ప్రయత్నం చేయాగా ఆయన మాట్లాడే స్థితిలో లేనంటూ.. నాకు ఆరోగ్యం బాలేదని నమస్కారం చేసి మరీ చెప్పారు. ఇంతలో ఆయన కుటుంభ సభ్యులు వచ్చి మేకపాటిని వేరే గదిలోకి తీసుకెళ్లారు. మరి నిన్న ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకొని కూర్చొని సవాల్ చేశారు. ఇంతలో ఆరోగ్యం బాలేదని దాక్కున్నారు. అంటే.. మేకపాటి భయపడ్డారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చూస్తే.. మేకపాటి అనుచరులు ఎవ్వరూ కూడా ఆయన ఇంటి వద్ద కనపడని పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.