మేకపాటికి తీవ్ర అస్వస్థ చెన్నైకి తరలింపు..!

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మర్రిపాడులోని తన నివాసంలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. ఇప్పుడేమీ మాట్లాడలేనని మీడియాకు చెప్పారు. షుగర్, బీపీ పరీక్షలతో పాటు వైద్య సిబ్బంది ఈసీజీ తీశారు. షుగర్, బీపీ లెవెల్స్ ఆందోళనకరంగా ఉన్నట్లు గుర్తించారు మేకపాటికి గుండె నొప్పి రావడంతో చెన్నైకి తరలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చింది. 2021 డిసెంబర్‌లో కూడా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు రావడంతో బెంగళూరులో సర్జరీ చేసి స్టెంట్‌ వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉదయగిరిలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే మేకపాటి వర్సెస్ వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. దీంతో గురువారం సాయంత్రం మేకపాటి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గర రోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నారు. ఎవరో ఉదయగిరికి వస్తే తరుముతామన్నారని.. వాళ్లెవరో ఇప్పుడు రావాలంటూ సవాల్ చేశారు. ఇక ఈ సవాల్ పై వైసీపీ శ్రేణులు రియాక్ట్ అయ్యారు. నేడు వారు… ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు చేరుకుని.. మేకపాటికి సవాల్ విసిరారు. ఇక ఈ నేపధ్యంలోనే.. ఉదయగిరిలో కాస్త హై టెన్షన్ వాతావరణం నెలకొంది.