రాజధాని ప్రాంతం అమరావతిలో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ నేత సత్య కుమార్ కారుపై దాడి జరిగింది. అమరావతి ఉద్యమం 1200 రోజుల కార్యక్రమానికి హాజరై వెళ్తున్న సత్య కుమార్ కారుపై మూడు రాజధానుల అనుకూల శిబిరానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడిలో సత్యకుమార్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సత్యకుమార్‌ను అక్కడి నుంచి తరలించారు. ఒక్కసారిగా సత్యకుమార్ కారుపై దాడి చేయడంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు.