గుంటూరు జిల్లాలో తెనాలిలో టీడీపీకి చెందిన నాయకులు బంద్ కి పిలుపునిచ్చారు. నిన్నటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు తమపై అన్యాయంగా దాడి చేశారంటూ.. టిడిపి కౌన్సిలర్లు ఆరోపించారు. వైశ్యుడైన టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ పై దాడిని ఖండిస్తూ, దాడి చేసిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సంఘాలు తెనాలిలో బంద్ చేపట్టాయి. ఈ బంద్ కు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సూచనలతో టిడిపి మద్దతు ప్రకటించింది. ఈ నేపధ్యంలోనే టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తమను ఎంతమంది అరెస్ట్ చేసినా ఈ బంద్ ను మాత్రం కొనసాగిస్తామని టిడిపి నాయకులు పోలీసులపై వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.