కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు విజయవాడలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల కేవీపీ ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ లో మాట్లాడారు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల కేవీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించారు. మూడు తరాలు ఈ దేశానికి సేవచేసిన కుటుంబం గాంధీ కుటుంబమని కేవీపీ పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఏపీ రాజకీయాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదా వద్దని ప్యాకేజీ తెచ్చుకున్నారా.. స్పెషల్ ప్యాకేజీపై సంతకం పెట్టి మరణశాసనం రాశారు. పోలవరాన్ని కేంద్రం వద్దు మేమే కడతామని తీసుకున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దించేసిన ఘనుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తనకు తనే గొప్ప నాయకుడని కితాబిచ్చుకుంటారు.. తనకు ముందు ఏమీ లేదు.. తన తర్వాత ఏమీ లేదని చెప్పుకునే కాలజ్ఞాని చంద్రబాబు అంటూ కేవీపీ కీలక వ్యాఖ్యలు రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఇక్కడ కూర్చుని చక్రాలు తిప్పడం కాదు.. ఢిల్లీ వెళ్లి చక్రాలు తిప్పండన్నారు. ఇప్పటికైనా రాహుల్ కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దామని..కేవీపీ అన్నారు. వైఎస్ కు దగ్గరగా ఉన్న తాను జగన్ కు దూరంగా ఎందుకు ఉంటున్నాననే విషయం గురించి త్వరలోనే చెపుతానని అన్నారు. ఇప్పుడే దీనిపై మాట్లాడనని… కానీ ఎప్పటికైనా ఈ విషయం గురించి మాట్లాడాల్సిందేనని… మరో రోజు మీడియా ముఖంగా అన్ని విషయాలను వివరిస్తానని చెప్పారు. వైఎస్సార్ స్నేహానికి, కుటుంబ బాంధవ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారని, ఆయన ఓ గొప్ప రాజనీతిజ్ఞుడని వ్యాఖ్యానించారు.