ఉదయగిరిలో అభ్యర్ధి ఫిక్స్..? చంద్రశేఖరరెడ్డి పని ఔట్

ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయం రచ్చకెక్కింది. క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంతో వైసీపీ మేకపాటిని సస్పెండ్ చేసింది. వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామనే హామీ లేని కారణంగానే ఆయన క్రాస్ ఓటింగ్ చేసారనేది పార్టీ నేతల వాదన. ఇదే సమయంలో మేకపాటి కూడా పార్టీ నేతలతో సై అంటే సై అంటున్నారు. సవాళ్లు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ప్రతికూల ఫలితాలు తప్పవని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి అనిల్ కు సీటు ఇవ్వరని.. ఒక వేళ ఇచ్చినా ఓడిపోతారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జిల్లా వైసీపీ నేతల సవాళ్లతో ఉదయగిరి సెంటర్ లో మేకపాటి కుర్చీ వేసుకొని కూర్చొన్నారు. వైసీపీ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని..ఎవరికి సీటు ఇచ్చినా గెలవరంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ నేపధ్యంలోనే వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి రియాక్ట్ అయి.. చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి వస్తే తరమి కొడతామంటూ.. ఆయన పార్టీకి పట్టిన దరిద్రం అంటూ, ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఓడిస్తామంటూ సవాల్ కి ప్రతి సవాల్ చేశారు. ఆ తారుణంలోనే మేకపాటి అస్వస్థకు గురయ్యారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని ఇప్పుడు ఈ రాజకీయాలపై ఎలాంటి కామెంట్ చేయనని మీడియాకి నమస్కారం చేసి మరీ సైడ్ అయ్యారు. అదే తరుణంలో .. ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. తన అన్నను రాజకీయాల్లోకి తెచ్చింది తానే అనీ, ఇప్పుడు ఆయన పదవీ వ్యామోహంతో ఉన్నారని చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. తన అనారోగ్యానికి కారణం కూడా తన కుటుంబ సభ్యులేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గంతో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లోనూ తన వ్యతిరేకులకు తన అన్న మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఆరోగ్యం సహకరించకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. ఇక ఈ నేపధ్యంలోనే.. ఉదయగిరికి నెక్స్ట్ అభ్యర్ధి ఎవరంటూ పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక, ఉదయగిరిలో కొత్త ఇంఛార్జ్ నియామకం పైన వైసీపీ నాయకత్వం ఫోకస్ చేసింది. ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నేడు పార్టీ నాయకత్వం ప్రకటన చేస్తుందని సమాచారం. కావాలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందని చర్చలు వస్తున్నాయి. మరి చూడాలి ఉదయగిరి కేంద్రంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.