1.టీడీపీ, కొన్ని దుష్టశక్తులు మూడు రాజధానులను అడ్డుకుంటున్నాయి..
అమరావతి ఉద్యమ స్ఫూర్తి ఏంటి ?.. టెంట్లు వేసుకోవడమా ? అంటూ ప్రశ్నించిన మంత్రి బొత్స సత్యనారాయణ.
2.రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దుపై చంద్రబాబు నోరు పడిపోయిందా..?
ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ మౌనంగా వెనుక కారణం ఏంటని ప్రశ్నించిన కేవీపీ రామచంద్రరావు.
3.’నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు’..
మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట, టీడీపీకి సరైన నేతలు లేకపోవడంతో మైండ్ గేమ్ ఆడుతున్నారన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి
4.ఏపీలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం..
విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం.
5.ఇన్నాళ్లు తనను ఆదరించినట్టుగానే తన కుమారుడిని కూడా ఆదరించండి..
తన కొడుకు రాజకీయ భవిష్యత్తును చంద్రగిరి నియోజకవర్గ ప్రజల చేతుల్లో పెడుతున్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటన.
6.అభివృద్ది చేయడం అంటే ఉన్నవాటికి రంగులు వేయించడం కాదు సిఎం జగన్..
తాను ధర్మవరం వస్తున్నాన్ని తెలిసి టిడ్కో ఇళ్లకు ఆగమేఘాల మీద రంగులు వేయిస్తున్నారని లోకేష్ సెటైర్లు.
7. అమరావతిలో కాపు సంఘ నేతలతో నేడు చంద్రబాబు భేటీ..
కాపు సంఘ ప్రతినిధులను ఆహ్వానించిన చినరాజప్ప.
8.98 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్నారు.. 15 లక్షల మందికి పెన్షన్ డబ్బులు ఎగ్గొట్టారు..
సీఎం జగన్ ను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలని వ్యంగ్యం ప్రదర్శించిన టీడీపీ నేత బొండా ఉమ.
9.అందరూ నేచురల్ స్టార్ నాని అంటారు కానీ… జగనే నేచురల్ స్టార్..
దసరా సినిమాను ప్రస్తావిస్తూ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు
10. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ ఐదేళ్లు సీఎంగా ఉంటారు..
జనసేన బలం గతంలో కంటే పెరిగిందన్న హరిరామజోగయ్య.