మంత్రివర్గంలో మార్పులు సీఎం జగన్ క్లారిటీ

సీఎం జగన్ ప్రక్షాళన దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, మంత్రివర్గంలో మార్పులు ఉండబోతున్నాయని, పార్టీలో 60 మందికి వచ్చే ఎన్నికల్లో నో టికెట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇక ఇదే అంశంపై నేడు జరిగిన రివ్యూ సమావేశంలో సిఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా కేవలం దృప్రచారం మాత్రమేనని, ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోవటంలేదని సిఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. మనం అధికారంలో లేకపోతే.. కోట్ల మంది ప్రజలు నష్టపోతారని వాలంటీర్లు, గృహ సారధులు ఏకమైతే.. ఈసారి కూడా అధికారం మనదే అన్నారు సిఎం జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని టిడిపి తెగ సంబరపడిపోతుందని, వాపును చూసి అది బలుపు అని చూపిస్తున్నారని, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కలిగింది విష ప్రచారం చేస్తున్నారని సిఎం జగన్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు సిఎం జగన్ ఆదేశించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ.. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా దృప్రచారం చేస్తున్నారని సిఎం జగన్ మండిపడ్డారు. అలాగే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉండరనే ప్రచారం చేస్తున్నారని.. అదంతా ఎల్లో మీడియా మైండ్ గేమ్ అంటూ.. మంత్రివర్గంలో మార్పులు లాంటివి ఏమీ ఉండబోవని నేడు జరిగిన రివ్యూ మీటింగ్ లో సిఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఆగష్టు నాటికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని తమ క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకొని.. ప్రతిఒక్కరూ ప్రజల్లోకి వెళ్ళి తామూ చేసిన మంచిని ప్రజలకు వివరించాలని సిఎం జగన్ వివరించారు. ఇంకా ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉందని, పని తీరు మరింత మెరుగ్గా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు, సూచించారు.