టీడీపీ సర్పంచ్ పై కేసు నమోదు పోటీ నుంచి ఎంపీ గల్లా జయదేవ్ డ్రాప్ తేల్చుకుందాం అంటూ బోండా ఉమ సవాల్

1.ఏపీ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ఫుల్ స్టాప్..
ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన సీఎం జగన్.

2.నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడతలో భాగంగా పేదలకి ఇళ్ల పట్టాలు..
ఇళ్లు లేనివారికి అమరావతిలో ఇళ్లు పట్టాలు ఇవ్వాలని సిఎం జగన్ అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో నిర్ణయ౦.

3.తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తా…
నారా లోకేశ్ కు సవాల్ విసిరిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి.

4.పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలతో సెంట్రల్ వాటర్ కమిషన్ భేటీ..
పోలవరం ముంపు, పునరావాసం, ఇతర అవంశాలపై ఈ భేటీలో చర్చ.

5.మళ్లీ అధికారంలోకి రావడం కోసమే గ్రాఫ్ పెంచుకోవాలన్నారు..
సీఎం జగన్ చెప్పినదాంట్లో తప్పేంలేదన్న మంత్రి జోగి రమేశ్.

6.సమాజంలోని ప్రముఖులను కూడా దొంగ కేసులతో వేధిస్తున్నారు..
మళ్లీ గెలవలేమన్న అసహనం సీఎం జగన్ లో కనిపిస్తోందని వర్ల రామయ్య ఎద్దేవా.

7. ఢిల్లీలో పర్యటనలో పవన్ కళ్యాణ్..
బీజేపీ ఏపీ ఇంచార్జీ మురళీధరన్ తో భేటీ.

8.తిరుపతి జిల్లాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు హత్యకేసులో కీలక మలుపు..
నిందితులుగా భావిస్తున్న తద్ సర్పంచ్ చాణిక్య ప్రతాప్‌తో పాటు గోపీనాథ్ రెడ్డి, రూపంజయ‌పై కేసు నమోదు

9.వైసీపీ ప్రభుత్వ బెదిరింపులే ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో దూరంగా ఉంటానని అనడానికి కారణ౦..
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన ఆరోపణలు.

10.పేర్నినాని వచ్చేఎన్నికల్లో ఎందుకు పోటీచేయనంటున్నారో చెప్పాలి..
దమ్ముంటే, సొల్లుపురాణాలు చెప్పడంమాని ప్రజాక్షేత్రంలో టీడీపీతో తేల్చుకోవాలని బోండా ఉమ సవాల్.