టీడీపీలో మరో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ సీనియర్ నేత, మార్క్ఫెడ్ మాజీ ఛైర్మన్ కంచి రామారావు.. తిరువూరులోని తన నివాసంలో సోమవారం సాయంత్రం హఠాన్మరణం చెందారు. మొదటి నుండి కాంగ్రెస్ వాదిగా ఉన్న కంచి రామారావు తిరువూరు సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా IFFCO డైరెక్టర్ గా తదితర పదవులు నిర్వహించారు. 2014 ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం లో చేరారు. స్వర్గీయ జలగం వెంగళరావు రోశయ్య రాజశేఖర్ రెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ఎన్ జనార్దన్ రెడ్డి తదితర మాజీ ముఖ్య మంత్రులకు ఆయన సన్నిహితుడిగా మెలిగారు. తిరువూరు నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు.. పార్టీలకు అతీతంగా రామారావు తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశారు.కంచి రామారావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. మార్క్ఫెడ్ ఛైర్మన్గా పనిచేసిన కంచి రామారావు సేవలను ఈ సందర్భం గా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. రామారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ రామారావుకు నివాళులు అర్పించారు. ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, తిరువూరు మాజీ శాసన సభ్యులు దిరిశంపద్మజ్యోతి, జనసేన పార్టీ నేతలు సంతాపాన్ని తెలియజేశారు.. రామారావు కుటుంబాన్ని పరామర్శించారు.