జగన్ సర్కారుకు హైకోర్టులో ఊరట

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల క భూమిని బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సీజే జస్టిస్ న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో జగన్ సర్కారుకు ఊరట దక్కింది.ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని, అక్కడికి వెళ్లొచ్చు కదా అని సూచించింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని ప్రశ్నించింది. దీంతో కేవలం రాజధాని భూములపై మాత్రమే మాట్లాడుతున్నట్లు లాయర్లు తెలిపారు. రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయ సమ్మతం కాదన్నారు. దీంతో మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ లోపు ప్రభుత్వం, సీఆర్డీయే కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.