పొత్తు లేకపోతే పవన్ వైసీపీతో కొట్లాడలేరు అక్రమాలు బయటపడుతున్నాయన్న ఉండవల్లి ఆ కేసులో తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్

1.’జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి..
ఏప్రిల్ 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడి.

2. ప్రభుత్వ అప్పులపై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు..
ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలపై బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం.

3.రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం జగన్ వెంటే ఉంటా.. లేదంటే వ్యవసాయం చేసుకుంటా..
నిన్నటి సమావేశానికి గైర్హాజరుపై తప్పుడు ప్రచారాలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లారిటీ

4.మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘించింది, ఇప్పుడు ఆ అక్రమాలు బయటపడుతున్నాయి..
రామోజీరావుకు పారదర్శకత ఉంటే.. నిజం ఒప్పుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.

5.ఏపీలో అమృత్ భారత్ పథకం కింద 72 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరిగాయి..
ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం.

6.బీజేపీ, జనసేనల పొత్తు కొనసాగుతుంది..
తమతో పొత్తు లేకపోతే వైసీపీతో పవన్ కొట్లాడలేరన్న టీజీ వెంకటేశ్.

7.మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
నోటీసులు ఇచ్చిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు.

8. వివేకా కేసుకు సంబందించి తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ వేసిన భాస్కర్ రెడ్డి..
దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమపై నేరాన్ని మోపడం సరికాదని పిటిషన్.

9.గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కేతిరెడ్డి ల్యాండ్ ను కొలవగా 45 ఎకరాలుగా చూపిస్తోంది.. మిగిలిన 20 ఎకరాలు ఎక్కడినుంచి వచ్చింది..
దమ్ముంటే అందరి సమక్షంలో ఎర్రగుట్టపై ఉన్న భూమిని కొలిపించే దమ్ము ఉందా కేతిరెడ్డి?” అంటూ లోకేష్ సవాల్

10.అకాలవర్షాలతో నష్టపోయిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి..
బటన్ నొక్కడం తప్ప నియోజకవర్గాలకు ఏం ఇచ్చారో జగన్‌ చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్.