ఢిల్లీ పెద్దల మార్క్ స్కెచ్ జగన్ కి జై.. బాబుకి హ్యాండ్

దేశ రాజకీయాలలో ప్రస్తుతం మోడీ ప్రభంజనం నడుస్తోంది. ఎన్నికలు ఏవైనా సరే బీజేపీదే హవా నడుస్తోంది. కేంద్రం కన్నెర్ర చేస్తే.. రాష్ట౦లో ఉన్న ముఖ్యమంత్రులకు ఇబ్బందులు తప్పవా..? 2019 ఎన్నికల్లో టిడిపి అందుకేనా ఓటమి పాలయ్యింది..? 2014లో కుటమితో, మోడీ సహకారంతో గెలిచిన బాబు.. 2019లో ఒడిపోవడానికి గల కారణం ఏంటి..? పవన్ కళ్యాణ్ బాబు దత్తపుత్రుడిగా అంటున్న వైసీపీ.. 2019 ఎన్నికల్లో పవన్ ఎందుకు సైడ్ అయ్యారు..? ఇంతకీ పవన్ ఎవరికి దత్తపుత్రుడు..? వచ్చే ఎన్నికల్లో కేంద్రం జగన్ కి సానుకూలంగా ఉంటారా..? టిడిపి తో పొత్తు పెట్టుకోవడానికి
బీజేపీ ఎందుకు సానుకూలత చూపట్లేదా..? ఇంత సడన్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది…? కొంతకాలంగా బీజేపీకి అంటీముట్టనట్టుగా ఉంటున్న వపన్ కళ్యాణ్.. తన పర్యటనలో ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ ఎలా చూడాలి..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ప్రజల మదిలో మెదులాడుతున్నాయి. అయితే.. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే.. అది బేజీపీకి ఆహ్వానించ పరిణామం కాదనే చెప్పాలి. అందుకే టిడిపి గెలవాలని బీజేపీ అస్సలు కోరుకోవట్లేదు. చంద్రబాబు విషయంలో బీజేపీ సెకండ్ ఆప్షన్ అస్సలు ఊహించట్లేదని.. బీజేపీ నాయకులు అంటున్నారు. ఒకవేళ 2019 ఎన్నికలో చంద్రబాబు గెలిచి ఉంటే.. బేజీపీకి ఇబ్బంది తప్పేది కాదని అంటున్నారు. ఇప్పటికే.. తెలంగాణ కేఎసీఆర్ కూడా మోడీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కేఎసీఆర్ తో పాటు దేశంలో మరికొందరు బీజేపీకి వ్యతిరేకంగా పావులు కడుపుతున్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి.. బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని.. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ.. ఇలా మోడీకి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు. బీఆర్ ఎస్ ను దేశంలో మరింత పటిష్ట పరిచేందుకు కేఎసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మరి జగన్ కేఎసీఆర్ కి మద్దతిస్తారా అంటే లేదనే చెప్పాలి. ప్రస్తుతం.. జగన్ కూడా కేఎసీఆర్ తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. జగన్ కి కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు.. బీజేపీపై కన్నెర్ర చేసి.. యుద్దానికి కాలు దువ్విన చంద్రబాబు.. ఇప్పుడు పిల్లి అవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే.. కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండే చంద్రబాబు ఎందుకు స్పందించలేదు. మోడీతో సాన్నిహిత్యం పెంచుకోవాలనే.. ఆ విషయంలో బాబు సైలెంట్ గా ఉన్నారని.. అంటున్నారు. కేంద్రంతో సఖ్యతతో ఉండి పవన్ కళ్యాణ్ మద్దతుతో పొత్తులు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని చంద్రబాబు భావన. అయితే అది జరిగే పనేనా అంటే.. నో అనే చెప్పాలి. ఎందుకంటే.. నాడు మోదీని విమర్శించిన బాబు నేడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయితే.. టిడిపి ని కూడా తమతో కలుపుకునేందుకు పవన్ కళ్యాణ్ దిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. 2014 లో వచ్చిన ఎంపీ స్థానాలతో పోల్చుకుంటే.. 2019 లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ప్రస్తుతం సిఎం జగన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కూడా జగన్ తో సాన్నిహిత్యాన్ని కంటిన్యూ చేస్తూ వస్తోంది. అంటే వచ్చే ఎన్నికల్లో టిడిపితో బీజేపీ పొత్తు పెట్టుకోదని చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది.