1.రేపు పల్నాడుకు సీఎం వైఎస్ జగన్..
ఫ్యామిలీ డాక్టర్ అనే మరో ప్రతిష్టాత్మక సంక్షేమ విధానానికి శ్రీకారం.
2.నేడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి..
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిఎం జగన్.
3.పవన్ ఓపక్క బీజేపీతో ఉంటూ మరోపక్క టీడీపీతో కలిసి పని చేస్తున్నారు..
పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అన్న ఆదిమూలపు సురేశ్.
4.సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేస్తున్నారు..
డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.
5.పవన్ కల్యాణ్ తో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాడతాం..
తమ పార్టీ పెద్దలను ఢిల్లీలో పవన్ కలిశారని సోము వీర్రాజు వెల్లడి .
6.టీడీపీ లేకుండా చేయడానికి జగన్ చేయని ప్రయత్నం లేదు..
పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగరేశాం.. 160 సీట్లు గెలుస్తాం అంటూ అచ్చెన్నాయుడు జోస్యం.
7. చంద్రబాబును కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు..
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం బాబుకు వినతిపత్రం.
8.జగన్‌కు చంద్రబాబు భయం పట్టుకుంది..
ప్రజలు ఇంటికి సాగనంపుతారని జగన్‌కు తెలిసిపోయిందన్న బుద్దా వెంకన్న.
9.రాష్ట్రంలో మద్యం తయారీ ద్వారా సీఎం జగన్‌కు 18 వేల కోట్లు వెళ్తున్నాయి..
మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలని వంగలపూడి అనిత డిమాండ్.
10.పోలవరం ఎత్తును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందా? లేదా?..
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశామని, కొన్ని విషయాలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని నాదెండ్ల మనోహర్ వెల్లడి.