జోకర్ అయిన బాలకృష్ణ రోడ్డు మీదే కొట్టుకున్న టీడీపీ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో వైసీపీ నుండి తమ పార్టీలో చేరికలు ఉంటాయని సేవ చేయడానికి తమ పార్టీలోకి వస్తే మంచిదేనన్నారు. జనం అంటే జగన్ కు కక్ష, అదోరకమైన సైకోతత్వం అంటూ జగన్ పై బాలకృష్ణ విమర్శలు గుప్పించారు. సీఎంకు మెగాబైట్స్, గిగాబైట్స్ అంటే ఏమిటో తెలుసా ? అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకొకపోతే ఓటే వేటు అవుతుందని బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారన్నారు. నాలుగేళ్లయినా ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. గంజాయిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన విమర్శించారు.

ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ రియాక్ట్ అయ్యింది. బాలకృష్ణ, లోకేష్ లు పెద్ద జోకర్లు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. మేం చేసింది చెప్పడానికే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక టీడీపీ నేతలు మాపై విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు విసుర్లు విసిరారు. ఎవరో నలుగురు ఎమ్మెల్యేలు గడ్డితిన్నంత మాత్రాన అందరూ అలా ఉంటారనుకోవడం పొరబాటు. మా గురించి పక్కన పెట్టి ముందు మీపార్టీ గురించి ఆలోచించుకోండి. గన్నవరంలో రోడ్డు మీదే కొట్టుకున్నారు. చంద్రబాబు పర్యటిస్తే పంచాయతీ పెట్టేందుకు గుడివాడలో మీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు అంటూ చురకలు అంటించారు.