గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు అడ్డుకున్న పోలీసులు

1.’జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి నేడు శ్రీకారం..
175 నియోజకవర్గాల్లో 20వ తేదీ వరకూ నిర్వహణ.

2.రాష్ట్రంలో 57 మంది ఐఏఎస్ బదిలీ..
ఎనిమిది జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం కల్పించిన ఏపీ ప్రభుత్వం.

3.మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం..
ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని సీఎం జగన్ ట్వీట్.

4.మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్..
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం సమయంలో అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న ఐదుగురు బాధితులకు తక్షణ సాయం.

5.ఏపీలో ఉన్న “మీడియా స్వేచ్ఛ” మారే రాష్ట్రంలోనూ లేదు..
ముఖ్య మంత్రిని గంజాయి మొక్కతో పోల్చి దుర్మార్గంగా, ఇష్టారాజ్యంగా కథనాలు వ్రాయడం, ప్రచురించడంపై కొమ్మినేని ఆవేదన వ్యక్తం.

6.8 లక్షల కోట్ల అప్పులు ఎవడబ్బ సొమ్మని చేశారు…
ఒకవేళ అప్పులు చేశారే అనుకున్నా… ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టిన బాలకృష్ణ.

7.మేం చేసిన అభివృద్ధి ఇవాళ మాకు స్వాగతం పలుకుతోంది..
అభివృద్ధికి అంబాసిడర్ టీడీపీ అని లోకేష్ వెల్లడి.

8.నేడు నేను విఫలం కావొచ్చు… రేపు విజయం సాధిస్తా ..
వరంగల్ లోని జాతీయస్థాయి విద్యాసంస్థ నిట్ లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.

9.జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆలూరులోని ఆలయ రథోత్సవానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..
పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాద౦.

10.వారాహిని చూడగానే వెలంపల్లి వెన్నులో వణుకు మొదలయ్యింది..
దళితులను కేవలం ఓటు బ్యాంకులుగా చుస్తూ దళితులను దగా చేస్తున్నారని పోతిన మహేష్‌ ఆరోపణ.