గన్నవరంలో తమ్ముళ్ల హై డ్రామా గల్లా పట్టి.. బట్టలు చింపి కొట్టుకున్న వైనం జారుకున్న కొల్లు రవీంద్ర

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు తన దూకుడు పెంచితే.. తెలుగు తమ్ముళ్ళు మాత్రo ఆదిపత్య పోరుకోసం తమ సొంత నాయకులపైనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అయితే.. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హనుమాన్ జంక్షన్లో జిల్లా నేతల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నెల 12,13,14వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలకు సర్దిచెప్పలేక టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడ నుంచి జారుకున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అసలే కృష్ణాజిల్లా రాజకీయం హాట్ హాట్ గా ఉంటుంది. అలాంటిది చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన అనడంతో అంతటా ఉత్కంట నెలకొంది. కైకలూరు, గన్నవరం, గుడివాడలో సైతం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ తరుణంలో తెలుగు తమ్ముళ్ళు ఇలా చేయడం చర్చనీయాంశంగా మారింది.