మరో వైసీపీ ఎమ్మెల్యే ఔట్..! షాకిచ్చిన సీఎం జగన్..?

వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తులు ఇంకా ఉన్నారన్న మాట వాస్తవమేనా..? నిజంగానే టిడిపితో 40 మంది టచ్‌లో వున్నారా..? ప్రస్తుతం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసేలా మరో వైసీపీ ఎమ్మెల్యే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో పాటు అంతకుముందు నుంచే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనీ వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి శుక్రవారం తన నియోజకవర్గంలో ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి తమ జగనన్న ఫోటో ఉన్న స్టికర్స్ అంటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఐదేళ్ళు పూర్తయితే పార్టీ క్యాడర్‌తో ఏ విదంగా వ్యవహరించాలి? వారికి ఏవిదంగా తోడ్పడాలి?రాష్ట్రాన్ని ఏవిదంగా ముందుకు తీసుకుపోవాలి?అనే విషయాలు నేర్చుకొంటారేమో? కనుక ప్రజలు మరో ఐదేళ్ళు అవకాశం ఇస్తే జగనన్న అన్నీ నేర్చుకుంటారని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి తీరు సరిగ్గా లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి కాస్త సున్నితంగానే చెప్పినప్పటికీ, తమ అధినేత తీరుతో అసంతృప్తిగా ఉన్నాననే విషయం స్పష్టంగానే చెప్పిన్నట్లు భావించవచ్చు. అసలే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి కొద్దిగా ఎదురుదెబ్బ తగిలింది అన్న బాధ, మరోవైపు తమతో 40 మంది టచ్ లో ఉన్నారని టిడిపి నేతలు పదేపదే చేస్తున్న ఆరోపణలు.. ఇలా ఎన్నో రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో.. సొంత పార్టీ నాయకులే ఇలా అసంతృప్తి వ్యక్తం చేయడంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అవ్వక తప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. పార్టీకి ద్రోహం చేసిన ఎవర్నైనా తేడా వస్తే.. పార్టీ నుండి సస్పెండ్ చేయడమే ఖాయం అని గతంలో వైసీపీ ముఖ్య నేతలు బహిరంగంగానే వెల్లడించారు. మరి ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి.