కుప్పంలో టీడీపీకి షాక్ కయ్యానికి కాలుదువ్విన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలో లోకేష్ పాదయాత్ర బంద్

1.తిరుపతి-హైదరాబాద్ ‘వందేభారత్’ హౌసుల్.. రైలులో ప్రయాణించిన సీఎస్ జవహర్ రెడ్డి…
ప్రధాని మోదీ సికింద్రాబాద్లో వందే భారత్ ట్రైన్ ప్రారంభించడం శుభపరిణామమని వెల్లడి.

2. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ..
వైఎస్సార్సీపీలో చేరిన 15 టీడీపీ కుటుంబాలు. వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ భరత్.

3. రైతు భరోసా కేంద్రాలు అద్భుతం..
రాజస్థాన్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ ఎండీ ప్రశంసలు.

4.వ్యవసాయ రంగంలో విత్తనం నుంచి కోత వరకు రైతులెదుర్కొంటున్న కూలీల వెతలకు ఏపీ ప్రభుత్వం చెక్ ..
వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో అందుబాటులోకి రానున్న అత్యాధునిక పరికరాలు.

5. రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినా అవి పూర్తి కాలేదన్న టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ .

6.కయ్యానికి కాలుదువ్విన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్..
పెదకూరపాడు అభివృద్దిపై చర్చకు సిద్దమంటూ రచ్చ.. రెచ్చిపోయి బస్సుపై దాడిచేసిన టీడీపీ మూకలు.

7.’నీకు దమ్ముంటే ఆధారాలతో సహా రా.. నేను తప్పు చేశానని నిరూపించు.. స్పాట్‌లో సారీ చెబుతా..
లేదంటే తాడిపత్రిలో పాదయాత్ర బంద్ చేయ్’ అంటూ లోకేశ్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్.

8.ఏపీలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి.. పాడేరు వాసులను తలచుకుంటుంటే జాలేస్తోంది..
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు.

9.జగన్ వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ, చంద్రబాబులను ఇంటికి పంపడం ఖాయం..
వై నాట్ అంటున్న బాలయ్యకు జగన్ అంటే ఏంటో చూపిస్తారన్నకొడాలి నాని.

10.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున వలంటీర్లు ప్రచారం చేశారు..
వలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అచ్చెన్నాయుడు వెల్లడి.